పరిసరాల పరిశుభ్రతతో పరిమళించనున్న విద్యార్థుల ఉజ్వల భవిత

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

కాసిపేట మండలం తాటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని దిశా మోడల్ స్కూల్లో స్వచ్ఛ పాఠశాల స్వచ్ఛత జ్ఞాన యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ మడావి వెంకటేష్ అన్నారు. చిన్ననాటి నుంచే పిల్లలు పరిశుభ్రత అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి అన్నపూర్ణ ఉపాధ్యాయురాలు మంగ రమాదేవి గ్రామస్తులు బుర్ర ప్రకాష్ గౌడ్ బుర్ర శ్రీను విద్యార్థులు పాల్గొన్నారు.