ఏపీకి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రిపోర్టర్: సతీష్
స్థలం: Gannavaram
కేరళలో గత నెల రోజులుగా ప్రకృతి వైద్యం పొందిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వైద్య చికిత్స ముగించుకుని ఆయన తిరిగి రాష్ట్రానికి రావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్సాఖత నెలకొంది.