సింగపూర్ ప్రధాని జీతం భారీగా పెంపు, విరాళం ఇస్తానన్న వాంగ్

రిపోర్టర్: విజయ్ స్థలం: World

సింగపూర్ ప్రభుత్వం ప్రధాని లారెన్స్ వాంగ్ సహా మంత్రుల వార్షిక జీతాలను భారీగా పెంచింది. ప్రధాని వాంగ్ వార్షిక వేతనం సుమారు 64 శాతం పెరిగి 3.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరింది. ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న రాజకీయ నాయకుడిగా ఆయన నిలిచారు. అయితే, పెరిగిన వేతనాన్ని రానున్న ఐదేళ్లలో పూర్తిగా విరాళంగా అందజేస్తానని వాంగ్ ప్రకటించారు. 15 ఏళ్ల తర్వాత మంత్రుల జీతాలను సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది.