పీఎం శ్రీ పథకంతో ఆధునిక విద్యా విధానమంటూ పీఐబీ వెల్లడి

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాయోగిక అభ్యాసం, సాంకేతికత, స్థానిక విజ్ఞానం, క్రీడలు, కళలు మరియు నైపుణ్యాభివృద్ధిని అందించేందుకు పీఎం శ్రీ (PM SHRI) పథకం ఎంతగానో దోహదపడుతుందని పీఐబీ ఇండియా వెల్లడించింది. ప్రతి బాలబాలికకు సురక్షితమైన మరియు సమ్మిళిత వాతావరణాన్ని కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంది.