గణేష్ చతుర్థి వేడుకల్లో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోదీ
రిపోర్టర్: శివ
స్థలం: India
గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విఘ్నేశుడికి భక్తిశ్రద్ధలతో హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన స్వామివారిని ప్రార్థించారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి.