వైకాపా దాడుల్లో పాల్గొన్న వారంతా రౌడీషీటర్లేనని హోం మంత్రి అనిత ధ్వజం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

శాప్ కార్యాలయంపై దాడి చేసి ఉపాధ్యాయులను కొట్టిన వారిలో అరవై శాతం మందికి పైగా రౌడీషీటర్లు, గూండాలేనని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నేరస్థులకు పార్టీలో పదవులిచ్చి ఉపాధ్యాయులపైకి ఉసిగొంపుతున్నారని ఆరోపించారు. ఒక్కొక్కరిపై సగటున పదేసి కేసులున్నాయని, వారి నేరచరిత్రను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.