టెక్సాస్‌లో ట్యాంటెక్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
రిపోర్టర్: వెంకట్
స్థలం: టెక్సాస్
టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ట్యాంటెక్స్ మరియు టిప్స్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్ హాజరై నిర్వాహకులను అభినందించారు. వివిధ వైద్య విభాగాల నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత సలహాలు, ఆరోగ్య అవగాహన కల్పించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని ట్యాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి తెలిపారు.