రీకౌంటింగ్ దరఖాస్తుకు పదిహేను నిమిషాలే గడువంటూ ఈసీ వార్నింగ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో రీకౌంటింగ్ కోరేందుకు అభ్యర్థులకు పదిహేను నిమిషాల సమయం ఉంటుంది. నిర్ణీత సమయంలోగా లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఫలితాల జాబితాపై రిటర్నింగ్ అధికారి సంతకం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రీకౌంటింగ్ కోరే అవకాశం ఉండదని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.