దీపావళి బాణాసంచా విక్రయాలకు తాత్కాలిక అనుమతులు: దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ పోలీస్ పిలుపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: హన్మకొండ

రానున్న దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు కోరే వారు, అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన పూర్తి దరఖాస్తులను నవంబర్ రెండో తేదీలోపు సమర్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత వెల్లడించారు. ఈ మేరకు అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్ణయించిన గడువులోగా దరఖాస్తు చేసుకునే వారు అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.