నా ఉద్దేశం మతాన్ని విమర్శించడం కాదంటూ నటి రేణు దేశాయ్ ఆవేదన
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేయడంపై నటి రేణు దేశాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మతాన్ని విమర్శించడం తన ఉద్దేశం కాదని, సనాతన ధర్మానికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆమె స్పష్టం చేశారు. పండగ పేరుతో రాత్రివేళ అధిక శబ్దంతో డీజేలు పెట్టడం, మద్యం తాగి అసభ్యంగా డ్యాన్స్ చేయడంపైనే మాట్లాడానని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలని నెటిజన్లను కోరారు.