టెంపుల్ డివైస్ వెబ్సైట్ క్రాష్: దీపిందర్ గోయల్ స్పష్టత

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన టెంపుల్ వేరబుల్ పరికరం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమైన వెంటనే వెబ్సైట్ క్రాష్ కావడంపై ఆయన స్పందించారు. ట్రాఫిక్ అంచనా వేయడంలో విఫలమయ్యామని, ఆటో స్కేలింగ్ లేకపోవడం చిన్న పొరపాటని ఆయన తెలిపారు. యాప్ ద్వారా ఆర్డర్లు పనిచేస్తున్నాయని, వెబ్సైట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు.