నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రి

రిపోర్టర్: మహేష్ స్థలం: బాపట్ల

పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గొట్టిపాటి రవి కుమార్ - విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు అనుసరించాల్సిన పంటల సాగు విధానాలపై విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియతో పాటు వాటి పంపిణీ తీరును మంత్రి సమీక్షించారు.