నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేసిన సీనియర్ నటి వడివుక్కరసి
రిపోర్టర్: గోపి
స్థలం: చెన్నై
సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి వడివుక్కరసి తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై స్పష్టతనిచ్చారు. తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన వడివుక్కరసి, బుల్లితెరపై కూడా సీరియల్స్‌తో విశేష ఆదరణ దక్కించుకున్నారు.