'డిజిటల్ పాలన దిశగా మరో అడుగు': ఏపీ వక్ఫ్ బోర్డు కొత్త వెబ్‌సైట్, యాప్!
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
ఏపీ వక్ఫ్ బోర్డు పాలనలో డిజిటలీకరణ వేగవంతమైంది. త్వరలోనే సరికొత్త వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికార వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీని ద్వారా వక్ఫ్ ఆస్తులు మరియు సేవలు మరింత పారదర్శకంగా మారనున్నాయి.