బీసీ ముఖ్యమంత్రిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో ఏదో ఒకరోజు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని, అయితే ఆ విషయంలో తమకు ఎలాంటి తొందర కానీ డెడ్లైన్లు కానీ లేవని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన కారణంగా భవిష్యత్తులోనూ కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందని, రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు బడుగు, బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన వెల్లడించారు.