రష్యా సైన్యంలో బలవంతపు చేరిక: స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యుల ఆవేదన

రిపోర్టర్: సతీష్ స్థలం: రాజన్న సిరిసిల్ల

ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన దొమ్మాటి కిషన్ను నకిలీ ఏజెంటు మోసంతో రష్యా సైన్యంలో బలవంతంగా చేర్చారని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య వెల్లడించారు. ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న సరిహద్దుల్లో కిషన్ తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నాడని, ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని తన భర్త భయంతో రోదిస్తున్నాడని కిషన్ భార్య వాపోయారు. వెంటనే స్పందించి బాధితుడిని రక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు.