మోడీ సంఘీభావ ర్యాలీ విజయవంతం: కూటమి నాయకులకు బిజెపి కృతజ్ఞతలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో బుధవారం మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇరవై ఐదు సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీని విజయవంతం చేసిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులకు మరియు అభిమానులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.