ఫెడరేషన్ నిర్ణయాలపై గ్రేట్ ఆంధ్ర న్యూస్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Andhra Pradesh
ఫెడరేషన్ అధికారులు పూర్తిగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గ్రేట్ ఆంధ్ర న్యూస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అసలు తాము చేసిన తప్పు ఏమిటని వారు ప్రశ్నించారు. ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ను పదవి నుంచి తొలగించాలంటే కనీస నిబంధనలు కూడా తెలియదా అని నిలదీశారు. కనీస కామన్ సెన్స్ లేకుండా ఈ రకమైన చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని వారు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.