పాల్వాయిలో పత్తి రైతులకు శిక్షణ: హెచ్డీపీఎస్ సాగుపై శాస్త్రవేత్తల సలహాలు
రిపోర్టర్: వెంకటాపురం విష్ణు
స్థలం: నల్గొండ
పాల్వాయి రైతు వేదికలో రేపు మధ్యాహ్నం పత్తి రైతులకు అధిక సాంద్రత సాగుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని సాగు పద్ధతులపై రైతులకు విలువైన సలహాలు, సూచనలు అందించనున్నారు. పరిసర ప్రాంతాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.