విశాఖ, అనకాపల్లి జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి క్లీన్స్వీప్: అల్లూరిలో వైఎస్సార్సీపీ హవా

రిపోర్టర్: గోపి స్థలం: విశాఖపట్టణం

విశాఖ మరియు అనకాపల్లి జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి క్లీన్స్వీప్ చేశారని, అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. విశాఖలో మూడు జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోగా, అనకాపల్లిలోనూ కూటమి హవా కొనసాగిందని, కానీ హోంమంత్రి అనిత సొంత గ్రామమైన నక్కపల్లిలో మాత్రం వైఎస్సార్సీపీ విజయం సాధించడం విశేషమని అధికారులు తెలిపారు.