ఉజ్జయిని రామ్ ఘాట్ వద్ద మహిళకు వేధింపులు, నిలదీసిన యువతి
రిపోర్టర్: శివ
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని రామ్ ఘాట్ వద్ద పండిట్ వేషధారణలో ఉన్న వ్యక్తి ఒకరు నైరా రాయ్ అనే యువతిని తన గదికి రావాలని అసభ్యంగా ఆహ్వానించారు. ఒంటరిగా ఉన్న తనను వేధించిన సదరు వ్యక్తిని ఆమె ధైర్యంగా నిలదీయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పవిత్ర క్షేత్రాల్లో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.