బుచ్చిరెడ్డిపాలెంలో ఇరవై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల శంకుస్థాపన

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘంలో ఇరవై రెండు కోట్ల రూపాయల రికార్డు స్థాయి నిధులతో రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో భారీగా నిధులు తీసుకువచ్చి పట్టణాభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శిస్తూ, ఆగిపోయిన మున్సిపాలిటీ భవన నిర్మాణం తోపాటు మలిదేవి వంతెన మరియు ఫైర్స్టేషన్లను అతి త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.