'గ్రామాల్లో పోలీసుల పల్లె నిద్ర': ప్రజలకు భరోసా కల్పిస్తున్న పోలీస్ శాఖ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Andhra Pradesh

రాబోయే ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. రాత్రి వేళల్లో గ్రామాల్లోనే బస చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ పోలీసు యంత్రాంగం ప్రజలకు చేరువవుతోంది.