నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్కుమార్రెడ్డిని గెలిపించాలని కాకాణి పిలుపు

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు నగర మేయర్ స్థానానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆనం విజయ్కుమార్ రెడ్డి అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నగర ప్రజలు ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల వేళ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వైయస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.