ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేసిన వ్యక్తికి ఇరాన్ ఉరిశిక్ష
రిపోర్టర్: రమేష్
స్థలం: ఇరాన్
ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్‌కు సహకరించి రహస్య సమాచారం చేరవేశాడనే అభియోగాలపై హొస్సేన్ పెదరాన్ అనే వ్యక్తికి ఇరాన్ సుప్రీంకోర్టు మరణశిక్షను ఖరారు చేయడంతో అధికారులు ఉరితీశారు. ఇస్ఫహాన్‌లోని కీలక సైనిక, క్షిపణి కేంద్రాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఎన్క్రిప్టెడ్ రూపంలో పంపి, ఇజ్రాయెల్ నుంచి నగదు పొందినట్లు ఇరాన్ న్యాయశాఖకు చెందిన మిజాన్ వార్తా సంస్థ వెల్లడించింది.