రామాయణం సినిమా పాటపై వస్తున్న విమర్శలకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందన

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

నితేష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణం చిత్రంలోని మంగళ్ రంగ్ పాటపై వస్తున్న విమర్శలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం సాధ్యం కాదని, తాను మొదట తన పాటలను విమర్శించుకుంటానని ఆయన తెలిపారు. కొన్ని సంగీత స్వరాలు కాలక్రమేణా మంచి అనుభూతిని ఇస్తాయని చెప్పారు. అందరి రుచికి తగ్గట్టు పాటలు చేయలేమని, కొన్ని సృజనాత్మక నిర్ణయాలు ఎప్పుడూ అందరికీ నచ్చాలని లేదని ఆయన స్పష్టం చేశారు.