పిల్లలు వద్దని నేను నిర్ణయించుకున్నా: నటి వరలక్ష్మి శరత్కుమార్ స్పష్టత

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

పెళ్లయిన ప్రతి జంటకు పిల్లలు ఉండాలనే నియమం ఏమీ లేదని, తనకు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నానని కథానాయిక వరలక్ష్మి శరత్కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పిల్లల్ని పెంచడానికి ఆర్థిక స్థోమత మాత్రమే కాకుండా తగిన సమయం, ఓర్పు, భావోద్వేగపరమైన సంకల్పం చాలా అవసరమని తెలిపారు. తన భర్త నికోలాయ్ సచ్దేవ్ కూడా తన అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారని, ఆయన మొదటి వివాహం ద్వారా వచ్చిన కుమార్తెను తాము సొంత బిడ్డలాగే చూసుకుంటున్నామని వెల్లడించారు.