బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం అద్భుతమైన అనుభవమన్న ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్స్టాస్
రిపోర్టర్: హరి
స్థలం: పుదుచ్చేరి
ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కాన్స్టాస్ భారత్‌తో జరిగిన టెస్ట్ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలరైన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఎంతో సవాల్‌తో కూడుకున్నదని, ఆ క్షణాలను తాను ఎంతగానో ఆస్వాదించానని పేర్కొన్నారు. కోహ్లీతో మైదానంలో జరిగిన సంఘటనపై ఎలాంటి మనస్పర్థలు లేవని, మ్యాచ్ తర్వాత ఆయన తనకు శుభాకాంక్షలు తెలిపారని స్పష్టం చేశారు.