కార్తికేయ పదవ చిత్రానికి కమ్ బ్యాక్ టైటిల్ ఖరారు
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
ఆర్ఎక్స్ వంద చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ తన పదవ చిత్రానికి సిద్ధమయ్యారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాతో ఆయన దర్శకుడిగా కూడా మారుతున్నారు. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీకి కమ్ బ్యాక్ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిక్ సంగీతం అందిస్తున్నారు.