అమెరికా ఇరాన్ యుద్ధ వాతావరణం త్వరలోనే ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ ధీమా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: వాషింగ్టన్
ఇరాన్‌తో ప్రస్తుతం నెలకొన్న ఘర్షణలు త్వరలోనే ముగియనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. కన్సాస్ సిటీలోని రేడియో ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సొంతం చేసుకోకుండా పటిష్టమైన హామీ తమకు కావాలని ట్రంప్ తేల్చిచెప్పారు. రాబోయే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.