బెంగళూరు ఆసుపత్రిలో రాప్తాడు బాధితురాలను పరామర్శించిన వైఎస్ జగన్

రిపోర్టర్: సురేష్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థినిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించినట్లు తెలిపారు. వైద్యులతో మాట్లాడి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారన్నారు. బాధితురాలి కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.