ఫిట్నెస్ అంటే కేవలం వ్యాయామం కాదు: సమాజంలో పెరుగుతున్న భాగస్వామ్య క్రీడల ఆదరణ

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

ఆధునిక సమాజంలో ఫిట్నెస్ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే పరిమితం కాకుండా సామాజిక అనుబంధాలకు వేదికగా మారుతోందని స్పెక్టాకం ఫౌండర్ అద్నాన్ అదీబ్ వెల్లడించారు. కోవిడ్ అనంతర కాలంలో యువత మారథాన్లు, అడ్డంకులను దాటే పోటీల పట్ల విశేష ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. డిజిటల్ ప్రపంచానికి దూరంగా నిజ జీవితంలో స్నేహితులను కలుసుకోవడానికి, కొత్త అనుభూతులను పొందడానికి ఇటువంటి క్రీడా ఈవెంట్లే ప్రధాన వేదికలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.