అసెంబ్లీలో గుండెపోటు బాధితుడికి సీపీఆర్ చేసిన మంత్రి శ్రీహరి
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పీఏ రాజు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలారు. అక్కడే ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి తక్షణ సమయస్ఫూర్తిని ప్రదర్శించి రాజుకు స్వయంగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వైద్య సిబ్బంది సాయంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మంత్రి చేసిన సాహసోపేత సేవలను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా ప్రశంసించారు.