పలాసలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి: అధికారులకు పోలింగ్ సామగ్రి పంపిణీ
రిపోర్టర్: నరేష్
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైందని అధికారులు తెలిపారు. ముప్పై ఆరు వార్డుల పరిధిలో అరవై ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పోలింగ్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని శనివారం ఉదయం నుంచి పంపిణీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక అధికారి శ్రావణ్ కుమార్, అదనపు అథారిటీ అధికారి శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.