పోలీస్ అమరవీరుల దినోత్సవం: కొల్లాపూర్లో ఘనంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం

రిపోర్టర్: సతీష్ స్థలం: నాగర్ కర్నూల్

పోలీసు అమరవీరుల దినోత్సవంలో భాగంగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) వెల్లడించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కొల్లాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి వేదికగా ఈ కార్యక్రమం కొనసాగిందని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసుల పనితీరును పరిశీలించారని తెలిపారు.