ఏపీలో భారీ వర్షాలు ఏడు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ ముప్పు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉత్తరాంధ్రతో పాటు పరిసర తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన ఫ్లాష్‌ఫ్లడ్ ముప్పు పొంచి ఉందని ఐఎండి స్పష్టం చేసింది. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.