సైబర్ నేరాలపై ఏఆర్ రెహమాన్ ప్రత్యేక వీడియో సందేశం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్ సుక్మా పోలీసుల విజ్ఞప్తి మేరకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'సైబర్ జాగృతి అభియాన్'లో భాగంగా ఈ ప్రచారం సాగుతోంది.