బాధిత కుటుంబానికి కొండంత అండగా నిలిచిన ఎమ్మార్పీఎస్ నేతలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో బడే కరుణాకర్ ఇటీవల మరణించారు. గురువారం జరిగిన దశదిన కర్మ సందర్భంగా ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్ర స్వామి, ఎమ్మార్పీఎస్ కుటుంబ సభ్యులతో కలిసి మృతుని ఇంటికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తమవంతు ఆర్థిక సాయాన్ని అందజేసి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.