చంద్రబాబు పాదం మోపితే రైతులకు అరిష్టమన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి
రిపోర్టర్: కిరణ్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబు పాదం మోపితే రైతులకు అరిష్టమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుపట్టారు.