శంకర్పల్లి భవానీనగర్లో ఘనంగా నిర్వహించిన విజయదశమి వేడుకలు
రిపోర్టర్: SARA ASHOK
స్థలం: శంకర్ పల్లి
శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సింగాపురం భవానీనగర్ కాలనీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు శ్రీకాంత్ నేతృత్వంలో కమిటీ సభ్యులు జమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి కొమ్మలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించగా, స్థానికులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.