మహిళల టీ20 మ్యాచ్: జింబాబ్వేపై భారత్ ఘన విజయం

రిపోర్టర్: సతీష్ స్థలం: Chhattisgarh

అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నికి ప్రసాద్ అద్భుత ప్రదర్శనతో జింబాబ్వేపై భారత మహిళల జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిందని క్రీడా వర్గాలు తెలిపాయి. ఛత్తీస్గఢ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలో తడబడినప్పటికీ, దీప్తి శర్మతో కలిసి నికి ప్రసాద్ అజేయ భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారని, దీనితో మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ ముందంజలో నిలిచిందని పేర్కొన్నాయి.