జడ్పీ నామినేషన్ల పరిశీలనలో బొత్స కుటుంబానికి షాక్: తిరస్కరణ

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా పరిషత్తు నామపత్రాల పరిశీలనలో బొత్స కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలిందని వైకాపా వర్గాలు పేర్కొన్నాయి. పూసపాటిరేగ స్థానం నుంచి నామినేషన్ వేసిన బొత్స చైతన్యబాబుకు స్థానికంగా ఓటు హక్కు లేకపోవడంతో అధికారులు నామపత్రాలను తిరస్కరించారు. అలాగే తెర్లాం, కొత్తవలస జడ్పీటీసీ స్థానాల్లో బరిలో ఉన్న మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర కుల ధ్రువీకరణపై వైకాపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.