భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతో ముఖ్యం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దండపల్లి

ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య కోరారు. బుధవారం ఆయన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని దండేపల్లి, రెబ్బెనపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల శివారులలో నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఇంకుడు గుంతలు భూగర్భ జలాల పెంపునకు ఎంతగానో దోహదపడతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్ పాల్గొన్నారు.