అనంతపురం జిల్లాలో దారుణం: రంపంతో బాలికపై దాడి చేసి బెంగళూరుకు తరలింపు
రిపోర్టర్: శివ
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో యువకుడు జరిపిన రంపపు దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు బెంగళూరుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. బాలిక ముఖం, వీపు భాగాలపై తీవ్ర గాయాలవ్వడంతో పాటు చేయి కూడా తెగిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలికి ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రత్యేక అంబులెన్స్‌లో అత్యవసరంగా తరలిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది.