ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సత్యసాయి పోలీసుల సత్తా

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

గుంటూరు నాగార్జున యూనివర్సిటీ, విఐటి యూనివర్సిటీలో నిర్వహించిన ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ మరియు డ్యూటీ మీట్లో శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం పదిహేడు పతకాలు సాధించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురాన విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలు సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.