సబర్మతి జైలులో బాంబు బెదిరింపుల కలకలం: హైఅలర్ట్ ప్రకటించిన భద్రతా ఏజెన్సీలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Gujarat
గుజరాత్ లోని సబర్మతి సెంట్రల్ జైలుతో సహా పలు కారాగారాల్ లో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఇమెయిల్ రావడంతో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. ఈ బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా ఏజెన్సీలు, బాంబు డిటెక్షన్ బృందాలు జైలు ప్రాంగణాల్ లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఉన్న హై సెక్యూరిటీ జైలు కావడంతో అధికారులు అదనపు నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.