టెక్ రంగంలో భారీ షాక్: ఉద్యోగులను తొలగించనున్న ప్రముఖ సంస్థ క్యాన్వా
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ గ్రాఫిక్ డిజైన్ ప్లాట్ఫాం క్యాన్వా భారీ సంస్థాగత మార్పుల్ లో భాగంగా సుమారు 1,271 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మెలానీ పెర్కిన్స్ వెల్లడించారు. మొత్తం ఉద్యోగుల్ లో ఇది 22 శాతం అని ఆమె తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగం కోల్పోతున్న వారికి ఆరు నెలల జీతం, ఆరోగ్య బీమాతో పాటు వివిధ రకాల ఆర్థిక సహాయక ప్యాకేజీలను అందిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.