విద్యార్థులకు అలర్ట్: సీబీఎస్ఈ 2027 ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి పన్నెండో తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఫిబ్రవరి పదహారు నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు సీబీఎస్ఈ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి టెన్షన్ లేకుండా ముందుగా ప్రిపేర్ అయ్యేందుకు ఈ టైమ్టేబుల్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అన్ని పరీక్షలు ఉదయం పది గంటల ముప్ పై నిమిషాలకు ప్రారంభమవుతాయని బోర్డు స్పష్టం చేసింది.