నాపై బురద చల్లేందుకే కిడ్నాప్ నాటకం: ఎమ్మెల్యే పుట్టా సుధాకర్

రిపోర్టర్: రాము స్థలం: వైఎస్సార్ కడప

మైదుకూరు వైద్యుడు రవిప్రకాశ్ కిడ్నాప్ వ్యవహారం వైకాపా నాయకులు ఆడిన నాటకమని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. భూ వివాదంలో కోర్టు తీర్పులు తనకు అనుకూలంగా ఉన్నా, కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తన మేనేజర్‌పై హత్యాయత్నం వెనుక కూడా రాజకీయ కుట్ర ఉందని, చట్టపరంగానే ఈ కేసులను ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు.