ఆన్లైన్ ట్రేడింగ్ నష్టాలతో నంద్యాలలో దంపతుల బలవన్మరణం

రిపోర్టర్: రమేష్ స్థలం: నంద్యాల

ఆన్లైన్ ట్రేడింగ్లో భారీగా నష్టపోవడంతో మనస్తాపం చెంది భార్య ఆత్మహత్య చేసుకోగా, భార్య మృతిని తట్టుకోలేక భర్త కూడా గంటల వ్యవధిలోనే బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నంద్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. నంద్యాలలోని రోజాకుంటలో నివాసముంటున్న కిరణ్, మౌనిక దంపతులు బుక్ స్టోర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ట్రేడింగ్లో నష్టపోయి తాను మోసపోయానని, బంగారు గాజులను బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు మౌనిక సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.